![]() |
![]() |

హరిత జాకీ.. టెలివిజన్ సీరియల్స్ లో నటిస్తూ పాపులారిటీ సంపాదించుకున్న నటి. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న 'పద్మావతి కళ్యాణం' సీరియల్ లో మహాలక్ష్మి పాత్రలో నటిస్తుంది. చెన్నై లో పుట్టి పెరిగిన హరిత.. తన పదిహేనవ ఏటనే సినిమాలలో నటించింది. అయితే తనకి సీరియల్స్ తో మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి.
జాకీని పెళ్ళి చేసుకుంది హరిత. వాళ్ళిద్దరు దూరదర్శన్ లో వచ్చే కార్యక్రమాలలో కలిసి నటించేవారు. ఆ తర్వాత ఈటీవిలో ప్రసారమైన 'సంఘర్షణ' సీరియల్ లో తొలిసారి తన భర్త జాకీతో కలిసి నటించింది. అప్పటి నుండి చాలా సీరియల్స్ లలో ఇద్దరు కలిసి నటించారు. అయితే జీ తెలుగులో ప్రసారమైన 'కలవారి కోడళ్ళు' సీరియల్ లో తను చేసిన నటనకి గాను అవార్డ్ కూడా వచ్చింది. ఆ తర్వాత వరుసగా సీరియల్స్ లో నటిస్తూ టాప్ మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ గా ఎదిగింది. అయితే జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'ముద్ద మందారం' లో అఖిలాండేశ్వరి గా చేసిన తనకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
అయితే తనకి సంబంధించిన ప్రతీ అప్డేట్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్ లుగా చేస్తూ అప్లోడ్ చేస్తుంటుంది. నేచర్ ఇచ్చింది ఇది అంటూ వర్షాల గురించి ఒక వ్లాగ్, వాళ్ళ అమ్మ బర్త్ డే కి తిరుపతికి వెళ్తున్నట్టుగా ఒక వ్లాగ్ చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా.. అవి ఎంతగా వైరల్ అయ్యాయో అందరికి తెలిసిందే. ఇప్పుడు తాజాగా పద్మావతి కళ్యాణం సీరియల్ సెట్ లో ఒక వ్లాగ్ ని చేసింది హరిత జాకీ. అక్కడ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారంటూ ఖాళీ దొరికినప్పుడు ఇలా సరదగా మాట్లాడుకుంటామని హరిత ఈ వ్లాగ్ లో చెప్పింది. కాగా ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.
![]() |
![]() |